జన్మభూమి-2 త్వరలో ప్రారంభం కాబోతోంది అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. జన్మభూమి-2లో ప్రజల భాగస్వామ్యం కావాలని.. ఇది దాతల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేలా ఉంటుంది అని పేర్కొన్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో వడపోత జరుగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుంది అని అన్నారు.
మనం కూటమిగా గెలుపొందాం.. కాబట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ అందరి ఆమోదంతో కూర్పు చేయాల్సి ఉంటుంది. పొత్తుల వల్ల టిక్కెట్లు దక్కని వారికి.. సరైన పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్ పదవుల భర్తీ జరగనుంది అని స్పష్టం చేసారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన తొలి జాబితా విడుదల చేస్తాం. చంద్రబాబు నాయకత్వం.. పవన్ పట్టుదల అవసరమని ప్రజలు భావించారు. ప్రజారంజక పాలన సాగిస్తూ.. పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. తొలి ఐదు సంతకాలతో చంద్రబాబు ప్రజల్లో గొప్ప నమ్మకాన్ని కల్పించగలిగారు అని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.