టాలీవుడ్ కు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తామని ప్రకటించారు ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్. ఇవాళ మీడియాతో ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ మాట్లాడుతూ… 2025-30 5 ఏళ్లకు టూరిజం పాలసీ తయారవుతుందని తెలిపారు. ఏపీలో టూరిజం కీ పారిశ్రామిక హోదా ఇస్తామని సిఎం చంద్రబాబు అన్నారన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పర్యాటకంగా నష్టపోయాయని తెలిపారు ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్. పర్యాటకం పడకేసిన సందర్బం గత ప్రభుత్వంలో చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తుందన్నారు ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్. స్వదేశీ, ప్రసాద్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి తీసుకొస్తామని ప్రకటించారు. రుషికొండ భవనాలు నీ ఏం చేయాలో అన్నదానిపై నెల రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్.