తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు వచ్చారు. బెటాలియన్ కానిస్టేబుల్లా భార్యలు, కుటుంబ సభ్యులు…తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి రావడం జరిగింది. దీంతో తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఈ తరుణంలోనే.. తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోండని… బెటాలియన్ కానిస్టేబుల్లా భార్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒక్క దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బెటాలియన్ కానిస్టేబుల్లా భార్యలు, కుటుంబ సభ్యులు. ప్రభుత్వం ఇలా మొండిగా వెళ్లడం వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడ అక్కడ కొన్ని రోజుల డ్యూటీ వలన పెళ్లి కూడా చేసుకోవడం లేదంటూ ఆందోళన చేశారు.