వైసీపీ పార్టీ వీడటం లేదు – కనిగిరి ఎమ్మెల్యే క్లారిటీ

-

వైసీపీ పార్టీ వీడటం లేదని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధు సూధన్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధు సూధన్ యాదవ్ పార్టీ మారబోతున్నారని.. టీడీపీలోకి వెళతారని కొందరు ప్రచారం చేశారు. అయితే.. దీనిపై కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధు సూధన్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు…నాకు రాజకీయ భిక్ష ఇచ్చిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.

Kanigiri YCP MLA Burra Madhu Sudhan Yadav is clear that he is not leaving the YCP party

ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు…నేను జీవితాంతం జగన్ తోనే ఉంటానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, జగన్ నా రాజకీయ దైవమని కొనియాడారు. పదేళ్ళుగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో నాకు అనుబంధం ఉందన్నారు. అందుకే నాకు టికెట్ రాకపోవడంతో కొంత బాధ పడ్డారు…కొత్త ఇంఛార్జ్ నారాయణ యాదవ్ కు పూర్తి సహకారం అందిస్తానని వివరించారు. కనిగిరి కోట పై వైసీపీ జెండా ఎగరటం ఖాయమని స్ఫష్టం చేశారు కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధు సూధన్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version