పొలిటికల్ రీ- ఎంట్రీపై కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటానని ప్రకటించారు మాజీ విజయవాడ ఎంపీ కేశినేని నాని. నాకు విజయవాడ అంటే మమకారం.. పిచ్చి.. అంటూ వ్యాఖ్యానించాడు.పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా.. ఎప్పుడూ స్వార్థం చూసుకోలేదని తెలిపారు.
పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు మాజీ విజయవాడ ఎంపీ కేశినేని నాని. కాగా… మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో… విజయవాడ ఎంపీగా… వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు కేశినేని నాని. కానీ తన సోదరుడి చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.