పోతిన మహేష్ ను పవన్ కళ్యాణ్ అప్పుల పాలు చేశాడని ఫైర్ అయ్యారు కేశినేని నాని. పోతిన మహేష్ ను అప్పుల పాలు చేసి నటింట ముంచేసిన పవన్ కళ్యాణ్ ను ఎవరు నమ్ముతారని నిలదీశారు కేశినేని నాని. విజయవాడ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ వైయస్సార్సీపి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ… చంద్రబాబుకి పేదలంటే చులకన….క్యాష్ కొట్టు టికెట్ పట్టు చంద్రబాబు స్కీమ్ అంటూ ఫైర్ అయ్యారు.
రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా అని నిలదీశారు. ఈ మూడు పార్టీలు అధికారంలోకి రావడానికి 600 హామీలు ఇచ్చారు. అధికారులకు వచ్చాక ఒక్క హామీ కూడా అమలు పరచలేదని ఆగ్రహించారు. చంద్రబాబు నా చేత పార్లమెంటులో మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టించాడు…ఇప్పుడు మళ్లీ మోడీతో కలిశాడు పేదలకు ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబుపై మండిపడ్డారు. అందరూ గో బ్యాక్ బాబు అంటున్నారు… నిన్ను తెలంగాణ పంపించడానికి రెడీగా ఉన్నారని చురకలు అంటించారు.