2024లో నేను మళ్ళీ గెలుస్తా..అప్పుడు చంద్రబాబు మా బొచ్చు పీకాలి- కొడాలి నాని

-

2024లో నేను మళ్ళీ గెలుస్తా..అప్పుడు చంద్రబాబు మా బొచ్చు పీకాలని ఎద్దేవా చేశారు కొడాలి నాని. పేర్ని నాని నా గురువు అని… పిల్లల చదువు కోసం చంద్రబాబు ఐదేళ్ళ హయాంలో 5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ 420 గాళ్ళు అని.. పేద పిల్లల కోసం మూడేళ్ళలో 16 మెడికల్‌ కాలేజీలు కడుతుంటే ఈ గుడ్డి వాళ్ళకు అభివృద్ధి కనిపించటం లేదట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టి ఇస్తుంటే తుప్పు గాళ్ళకు కనిపించటం లేదని.. ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడన్నారు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు సీఎం ఇచ్చారన్నారు.

దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?? చంద్రబాబు చవట దద్దమ్మ అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యారు. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట… మా బొచ్చు పీకాలంటూ నిప్పులు చెరిగారు. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కు గా ఓడించామని.. నీ సొంతం కుమారుడిని మంగళగిరిలో ఓడించాం..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించి తీరుతామని హెచ్చరించారు కొడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version