చంద్రబాబుకు కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు మగాడు అయితే గుడివాడ నుండి పోటీ చేయాలని సవాల్ చేశారు. గుడివాడలోని టిడ్కో గృహాల సముదాయం ప్రాంగణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ, గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం బాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు కొడాలి నాని.
వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ కలిసి గుడివాడలో పేదలకు ఇళ్ళు, మంచినీటి సదుపాయం కోసం 650 ఎకరాలు కేటాయించారని చెప్పారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని వివరించారు. సీఎం పదవి నుంచి జగన్ ను దించే మగాడు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టలేదు.. గుడివాడకు నేనే ఎమ్మెల్యేను అంటూ స్పష్టం చేశారు కొడాలి నాని. గుడివాడ ఎమ్మెల్యేగా ఇళ్ళ పట్టాల సమస్యను పరిష్కరించమని అన్నట్లో రాజశేఖరరెడ్డిని అడిగాను.. అప్పుడు నేను టీడీపీ ఎమ్మెల్యే అయినా వైఎస్సార్ సానుకూలంగా స్పందించారన్నారు.