జైల్లో ఉంటే దొమలు కుట్టక…రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? – కొడాలి

-

 

జైల్లో ఉంటే దొమలు కుట్టక…రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? అంటూ చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై కొడాలి నాని సెటైర్లు పేల్చారు.చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని.. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని మండిపడ్డారు.

kodali vs chandrababu

నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది..? రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా..? అని ప్రశ్నించారు. లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడు.. మేం లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని.. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు..? అని ఆగ్రహించారు.
చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా..? అడెవడో స్టార్ వస్తే.. వాడిని లోకేెష్ అన్నయ్య అంటాడని పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి మండిపడ్డారు. ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version