ఏపీలో శవం లేస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడు – ఏపీ మంత్రి

-

ఏపీలో శవం లేస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ… తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చురకలు అంటించడం జరిగింది. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని మండిపడ్డారు.

kollu ravindra slams jagan

పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని చురకలు అంటించారు. రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందని.. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారన్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది…ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలినాని పారిపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version