కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే – మంత్రి కొల్లు రవీంద్ర

-

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇవాళ మీడియాతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

kollu ravindra slams perni nani

ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని చురకలు అంటించారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని పేర్కొన్నారు. రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందని ఆగ్రహించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..

Read more RELATED
Recommended to you

Exit mobile version