ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే – కొల్లు రవీంద్ర

-

ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే.. సూత్రధారి, పాత్రధారి అన్నీ పేర్నినానీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నానిపై రియాక్ట్‌ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని ఒక బియ్యం దొంగ…. 7500 బస్తాల బియ్యం పందికొక్కు మాదిరి తిన్నాడని ఆరోపణలు చేశారు.
మళ్ళీ వచ్చి నీతి కబుర్లు చెబుతున్నాడని ఫైర్‌ అయ్యారు. అభూత కల్పనతో డ్రామా లు ఆడుతున్నాడని ఆగ్రహించారు.

kollu ravindra slamss perni nani

పేదలకు పంచాల్సిన బియ్యం సొంత గోదాము నుంచి తరలించి డబ్బులు కొట్టేశాడని ఆరోపణలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. కనీసం భార్య పేరు మీద ఉన్న గుడౌన్ రేపు ఏమన్నా ఇబ్బంది వస్తదని భయం కూడా పడలేదని ఫైర్‌ అయ్యారు. సీఎంకు నేను ఏదో చెబితే…. సిఎం నన్ను ఏదో అన్నాడని అబద్ధాలు ఆడుతున్న పేర్ని నాని అసలు మనిషి కాదని చురకలు అంటించారు. పేర్ని నాని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి…. భార్యను అడ్డం పెట్టుకొని సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ఆగ్రహించారు.
రాజకీయ లబ్ధి పొందటం కుదరదన్నారు. రేషన్ బియ్యం కేసులో సూత్రధారి పేర్ని నాని అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news