వైసీపీ అధికార ప్రతినిధులుగా కోరుముట్ల, తాటిపర్తి

-

వైసీపీ లో పలువురికి కీలక బాధ్యతలు దక్కాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలువురు నేతలకు ఇవాళ కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆముదాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా చింతాడ రవికుమార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అదేవిధంగా రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ను నియమించారు. ఇటీవలే వైసీపీలో పలు కీలక పదవులను పార్టీ కీలక నేతలతో భర్తీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version