100 రోజుల పాలన ఫెయిల్యూర్ ని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం : జగన్

-

చంద్రబాబు 100 రోజుల పాలన ఫెయిల్యూర్ ని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని మాజీ సీఎం  జగన్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని  తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.

తిరుమలలో వేలాది మంది పోలీసులు మోహరించారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రను దెబ్బ తీస్తున్నారు. 6నెలలకొకసారి టెండర్లు జరుగుతాయి. టీటీడీ బోర్డు టెండర్లు అప్రూవుల్ చేస్తోంది. టీటీడీ బోర్డు ప్రసిద్ధిగాంచినది. దేశం మొత్తం నుంచి సభ్యత్వం ఉంటుంది. బోర్డు సభ్యత్వం కోసం కేంద్ర మంత్రులు, చుట్టూ ప్రక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమండ్ చేస్తారు. క్వాలిటీ ఏదైనా అనుమానం వస్తే వాటిని రిజెక్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు హయాంలో 15సార్లు రిజెక్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version