లక్ష్మీపార్వతి హాట్‌ కామెంట్స్‌.. నా జీవితాన్ని నాశనం చేస్తున్నారంటూ?

-

సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి….అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయని ఆగ్రహించారు.

Lakshmi Parvati paid tributes at NTR Ghat on the occasion of senior NTR’s 29th death anniversary

నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశానని గుర్తు చేశారు. అయినా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి లక్ష్మీ పార్వతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version