చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చంద్రబాబు రెండున్నర ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడింది లక్ష్మీపార్వతి.  ఇప్పుడు ఆరు లక్షల కోట్లకు చంద్రబాబు అధిపతి ఎలా అయ్యారు అని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చెప్పగానే వెంటనే చంద్రబాబు అక్కడ వాలిపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన గంటకి ఫేక్ సర్వే బయటకు వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నా నేపథ్యంలో చంద్రబాబు రక రకాల వేషాలు వేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టిడిపి పుట్టిందని.. అలాంటి పార్టీని హస్తం పార్టీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును టిడిపి కార్యకర్తలే తరిమేయాలని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version