ఏపీ రైతులకు శుభవార్త.. సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. రబీలో 10.92 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేస్తారని అంచనా ఉండగా, RBKల ద్వారా 3.44 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 25% సబ్సిడీ ఇవ్వగా, ఈసారి 40% సబ్సిడీతో విత్తనాలను అక్టోబర్ 1 నుంచి అందించనుంది.
ఎకరానికి ఒక బస్తా చొప్పున 5 ఎకరాల్లోపు రైతులకు 5 బస్తాలు పంపిణీ చేయనుంది. వరి, మినుము, ఉలవలు, చిరుధాన్యాలు, వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను కూడా సిద్ధం చేసింది. అటు ఏపీ ఇంటర్ విద్యార్థులకూ జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో ఇంటర్ విద్యార్థులకూ గోరుముద్ద అమలు చేయనుంది జగన్ సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ప్రస్తుతం 1-10వ తరగతి వరకు అమలు చేస్తున్నామనీ.. త్వరలో ఇంటర్ కూ వర్తింపు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ పథకానికి రూ.2,729 కోట్లు మాత్రమే బాబు సర్కార్ ఖర్చుపెట్టిందన్నారు.