ఐటీ నోటీసులకు ఆన్సర్ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. లెక్కల్లో చూపని ఆదాయంపై IT శాఖ నోటీసులపై ఎవరైనా సమాధానం చెప్పాల్సిందేనని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరు అత్తోటలో పర్యటిస్తున్న ఆయనను చంద్రబాబుకు నోటీసులపై మీడియా ప్రశ్నించింది.
దీనికి స్పందిస్తూ…’ఐటికి సరైన ఆన్సర్ చెప్పకపోతే తగిన పన్ను కట్టాలని అధికారులు ఆదేశిస్తారు. అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు చేస్తారు. మనీల్యాండరింగ్ పై ఈడి రంగంలోకి దిగుతుంది’ అని పేర్కొన్నారు.
కాగా, టిడిపి అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం టెక్స్టైల్ కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. బాబు ష్యురిటీ, భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుత్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.