రెండో రోజు ముగిసిన లోకేష్ సీఐడీ విచారణ.. మళ్లీ అవే ప్రశ్నలు..!

-

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సిఐడి విచారణ ముగిసింది. ఉదయం 10:00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 6 గంటల పాటు లోకేష్ ను సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక్క రోజే విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ సిఐడి అధికారుల సూచన మేరకు రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యానని తెలిపారు.

రెండో రోజు దాదాపు 47 ప్రశ్నలు అడిగారు అవి కూడా నిన్న అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారు వాషింగ్ మిషన్ లో వేసి తిప్పినట్టుగా మంగళవారం అడిగిన ప్రశ్నలే తిట్టి తిప్పి అడిగారు. ఈ కేసులో నిందితురాలు కాని మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ నా ముందు పెట్టి ప్రశ్నించారు. ఆమె ఐటి రిటర్న్స్ మీ వద్దకు ఎలా వచ్చాయని దర్యాప్తు అధికారులని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారు నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదేపదే అడిగి ఇబ్బంది పెట్టారు.

ఈ కేసులో మరోసారి లేక ఇస్తారా అని దర్యాప్తాధికారిని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదని లోకేష్ వివరించారు. లింగంమనేని రమేష్ కు చెల్లించిన అద్దె చెల్లింపులపై ప్రశ్నించారు. రమేష్ ఇంట్లో అద్దకు ఉంటూ 27 లక్షలు రెంటల్ అడ్వాన్స్ కట్టారు అందుకు సంబంధించి ఐటీ రిటర్న్స్ లో లేదని చెప్పారు ఐటీ రిటర్న్ కు సంబంధించి ఆడిటర్ను అడగాలని చెప్పినట్టు తెలిపారు లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version