సీఐడీ ముందు రెండో రోజు విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్నారు నారా లోకేష్. నిన్న ఆరు గంటల పాటు ప్రశ్నలు సంధించిన సీఐడీ..ఇక రెండో రోజు విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు.
మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి నారా లోకేష్ కు నిన్న 41ఏ నోటీసు ఇచ్చింది సీఐడీ. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు రానున్నారు నారా లోకేష్. రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్ తో పాటు.. మాజీ మంత్రి నారాయణ అల్లుడ్ పునీత్ కూడా రానున్నారు.
కాగా, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. జైలు జీవితం గడుపలేక చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత నెలకొందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. రాజమండ్రి జైలులో డీహైడ్రేషనుతో ఇబ్బంది పడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.