Crime: ఏపీలో లారీ, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 4 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
యానం లో బర్త్ డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు యానాం లో ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో బయలుదేరి వస్తుండగా ప్రమాదం జరిగింది.
రాత్రి 12.30 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 గురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా… కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మృతుల వివరాలు సాపే నవీన్ (22) నగరం, కొల్లాబత్తుల జతిన్ (26), నల్లి నవీన్ కుమార్ (27), వల్లూరి అజయ్ (18) గా పోలీసులు గుర్తించారు.