టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి అలా చేసాడు ?

-

టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి అలా చేసాడు అంటూ వైసీపీ పార్టీ చెబుతోంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలివే అంటూ పేర్కొంది. రెంటచింతల మండలం పాల్వాయిగేటులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపిందట టీడీపీ. వైయస్‌ఆర్‌సీపీ‌కి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై కూడా దాడి చేశారట.

Ramakrishna Reddy Pinnelli in hyd

ఐతే దీనిపై సమాచారం అందగానే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కూడా దౌర్జన్యం చేశారట. టీడీపీ ఓటమికి సాకుల కోసం అసలు విషయాలు దాచేసి.. తప్పుడు ప్రచారంతో బురదజల్లుతోందని వైసీపీ పేర్కొంది. ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండ సృష్టించారని వైసీపీ తెలిపింది. వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర చేసిందని వెల్లడించింది. పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు సృష్టించారని వైసీపీ ఆరోపణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version