మోహన్ బాబు కు ఊహించని షాక్ తగిలింది. జనసేనలోకి మోహన్ బాబు కొడుకు, కోడలు వెళ్లనున్నారట. జనసేనలో చేరనున్నారట మనోజ్, మౌనిక. ఇందులో భాగంగానే… ఆళ్లగడ్డ వెళుతున్నారట. నేడు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేశారట మోహన్ బాబు కొడుకు, కోడలు.
భూమా ఘాట్ లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయనున్నారట. దీంతో కొత్త టర్న్ తీసుకుంటోన్నాయి మంచు ఫ్యామిలీ వ్యవహారాలు. తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయనున్నారట. మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. దీంతో మనోజ్, మౌనిక నిర్ణయంపై ఆసక్తిగా చూస్తున్నారు.
జనసేనలో చేరనున్న మంచు మనోజ్
నేడు ఆళ్లగడ్డకు వెయ్యి కార్లతో వెళ్లనున్న మంచు మనోజ్, మౌనిక pic.twitter.com/3L7jyPZ91T
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024