ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ స్పోక్స్ పర్సన్ అంబటి రాంబాబు బుధవారం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్వయంగా ఆయన కోర్టులో వాదనలు వినిపించినట్లు సమాచారం.
కాగా, అంబటి రాంబాబు వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తరఫు కౌంటర్ దాఖలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ప్రతిపక్ష పార్టీ తరఫున గట్టిగా ప్రభుత్వానికి కౌంటర్స్ ఇస్తే అంబటి రాంబాబు.. హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించడంతో రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని.. పోలీసు యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.