Megastar Chiranjeevi gave a big shock to Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో మోదీ చేతులు పైకెత్తి అభివాదం చేయడం సంచలనంగా మారింది. భవిష్యత్ రాజకీయాలు మెగా బ్రదర్స్ తో కలిసి చేయబోతున్నట్లు ఏపీ ప్రజానీకానికి మోదీ సంకేతాలు ఇచ్చినట్లు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమా అనే చర్చ కూడా సాగుతుంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన తమ్ముడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం గర్వంగా అనిపిస్తోందన్నారు. గుండెల నిండా సంతోషంగా ఉందని, రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉందనే భరోసా కలుగుతోందన్నారు. పాత-కొత్త కలయికలో ఈ మంత్రివర్గం చాలా బాగుందని కితాబిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాడనే నమ్మకం తమ్ముడిపై ఉందని చిరు చెప్పారు.