జగన్ పై హోం మంత్రి అనిత వంగలపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అవ్వడం కోసం సొంత బాబాయ్ నే చంపించిన వాడు తల్లి, చెల్లి పై కేసులు పెట్టడంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు అనిత వంగలపూడి. ఏదో రోజు తల్లి, చెల్లిపై కేసులు పెడతాడాని అనుకున్నాం….అనుకున్నట్లే జరిగిందన్నారు హోం మంత్రి అనిత వంగలపూడి.
జగన్ కి తల్లి, చెల్లి పై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అందరికీ అర్థమైందన్నారు హోం మంత్రి అనిత వంగలపూడి. వైసీపీ నాయకులు జగన్ గురించి ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారన్నారు హోం మంత్రి అనిత వంగలపూడి. పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ… జగన్.. మీ మైండ్ ఏమైనా బ్లాక్ అయ్యిందా..? మీకు సబ్జెట్ తెలియదా..? రాదా..? అన్నారు. అసలు చట్టమే లేని దిశ ఉందంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పారు. అది కేవలం బిల్లు మాత్రమే… లోకేష్ సవాల్ ను స్వీకరించే దమ్ము, ధైర్యం జగన్ కు లేదని విమరహసాలు చేశారు.
–