Pusha 2 : జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ !

-

జానీ మాస్టర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారం కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్ను పుష్ప 2 నుంచి తొలగించినట్లు…చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నిర్మాత నవీన్ అధికారిక ప్రకటన చేశారు. జానీ మాస్టర్ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకున్నామని వివరించారు.

ప్రమోషన్స్ ఎక్కువ ఫోకస్ నార్త్ సైడ్ ఉండబోతుందన్నారు నిర్మాత నవీన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే ఓవర్సీస్‌లోనూ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సాంగ్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ కూడా ఉండొచ్చు అన్నారు నిర్మాత నవీన్. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000+ దాటింది అది నిజమే అన్నారు. జాతర సీన్స్ కి 35 డేస్ షూట్ జరిగింది. చాలా వరకు ఖర్చు చేశాం దీని కోసం. ఎంత ఖర్చు చేశామో… అంత బాగా ఆ సీన్స్ వచ్చాయన్నారు నిర్మాత నవీన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version