బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన కారు తో నాకు సంబంధం లేదని వెల్లడించారు మంత్రి కాకాణీ. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్, MDMA మరియు కొకైన్ వాడినట్లు గుర్తించారు.. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 25 మందికి పైగా యువతులు సహా, 100 మందికి పైగా పార్టీలో దొరికిపోయారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అక్కడున్న బెంజ్ కారులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట పాస్‌పోర్టు దొరికిందని అంటున్నారు… ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు లభ్యమయ్యాయి. అయితే.. ఈ వార్తలపై మంత్రి కాకాణి స్పందించారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన కారు తో నాకు సంబంధం లేదని వెల్లడించారు. కారు పై స్టిక్కర్ ఒరిజినలా లేదా ఫోటో కాపీన అనే విషయాన్ని పోలీసులు పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. 2023 తో ఆ స్టికర్ కాల పరిమితి ముగిసిందని స్పష్టం చేశారు మంత్రి కాకాణి.