రైసీ ప్రయాణించిన బెల్‌-212 హెలికాప్టర్ కు గతంలోనూ ప్రమాదాలు

-

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు విడుదల చేసిన ఫొటోలు, వీడియోల ప్రకారం ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్‌-212గా (Bell 212) గుర్తించారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్‌ టెక్స్‌ట్రాన్‌ కంపెనీ తయారు చేసింది. తాజా హెలికాప్టర్‌ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్‌ను 1979లో కొనుగోలు చేసినట్లు సమాచారం. తర్వాత వారికి అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు సమాచారం. బెల్‌-212లో  సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించగలరు. పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా.. ‘వర్క్‌హార్స్‌’గా దీన్ని పేర్కొంటుంటారు.

ఈ హెలికాప్టర్‌ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్‌-212.. లూసియానా తీరంలో కుప్పకూలగా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సాధారణ ఆఫ్‌షోర్‌ రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా.. మెకానికల్‌ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్‌ కోల్పోయిన కారణంగా జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version