ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు – మంత్రి కాకాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో సాగునీరు లేదని, కరువు విలయతాండవం చేసిందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నాసిరకం ఎరువులు, విత్తనాలు విక్రయించారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కోర్టు చోరీ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదన్న కాకాని.. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారని గుర్తు చేశారు.

ఇక రాష్ట్రంలో ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస అవగాహన కూడా లోకేష్ కి లేదని ఎద్దేవా చేశారు. సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకువస్తామని ఇప్పుడు చెబుతున్నారని.. అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతు రథం పేరుతో కమిషన్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత టిడిపి నేతలకు లేదన్నారు మంత్రి కాకాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version