బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్… సీతక్క కౌంటర్ !

-

బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్ అంటాడని బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. గత 11 ఏళ్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహించారు. నిరుద్యోగులు, యువకులకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని సీతక్క ఫైర్‌ అయ్యారు.

see

బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట మాట్లాడడని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబధ్రులను ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారన్నారు. ఇండియాను మాటిమాటికి పాకిస్థాన్ తో పోల్చి భారతదేశ గొప్పతనాన్ని తగ్గించొద్దని కోరారు మంత్రి సీతక్క.

  • కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్టే
  • ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది
  • బీజేపీ భారత్ టీం, కాంగ్రెస్ పాకిస్తాన్ టీం – బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Exit mobile version