ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్న సమయంలో నిత్యావసర సరుకుల అమ్మకాల విషయంలో వ్యాపారస్తులు అనుసరిస్తున్న ధోరిణిపై రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.వ్యాపారస్తులు నిత్యావసరాలను ఎంఆర్‌పీ రేటుకు మించి అమ్మకాలు జరిపితే కేసులు పెడతామని హెచ్చరించారు.ఇబ్రహీపట్నం ఫెర్రీ, గుంటుపల్లి గ్రామ ఆర్‌సీఎం చర్చి, తుమ్మలపాలెంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇటువంటి కష్టసమయంలో అందరూ నిజాయతీ, బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
వరద ముంపు ప్రాంతాల్లో ప్రతి బాధిత కుటుంబానికి సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్న మంత్రి నాదెండ్ల..ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఏకంగా కేసులు పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముంపు గ్రామాల బాధితులు ప్రతి ఒక్కరికీ సరుకులు అందజేస్తామని,ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు.అంతేకాకుండా నిత్యావసర సరుకులు ఎవరైనా బ్లాక్ చేసి విక్రయించినట్లు తెలిసినా వారి సంగతి తేలుస్తామన్నారు.