ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ చేస్తామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తామని… ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ చేస్తామని ప్రకటించారు.
ఇండస్ట్రీ లైక్ కరిక్యులమ్ తీసుకువస్తామని కూడా తెలిపారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ పై దృష్టిపెడతామన్నారు. న్యాయవివాదాలకు తావులేకుండా పకడ్బందీగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందన్నారు.
స్కూల్స్ లో క్రీడల కోసం యాక్టివ్ ఏపీ కార్యక్రమాన్ని చేపడతున్నామని… స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పించడం ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదన్నారు. దీనిమీద దృష్టిపెట్టాం.. సాధ్యమైనంత వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యాక్టీవ్ ఏపీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేలా ప్రణాళికలు చేస్తామని వెల్లడించారు. విద్యార్దులకు క్రీడల ద్వారా స్ట్రెస్ తగ్గేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. స్కూల్ విద్యార్ధుల మధ్య క్రీడా పోటీలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.