ఎమ్మెల్సీ ఎన్నికలు.. రంగంలోకి రాములమ్మ !

-

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడి నెలకొంటున్న నేపథ్యంలో.. రంగంలోకి రాములమ్మ దిగారు. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు విజయశాంతి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరారు విజయశాంతి. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారట విజయశాంతి.

Vijayashanthi talks are being held in Delhi for the MLC seat

బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత… విజయశాంతి.. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంటిముట్టనట్లే ఉన్నారు. అయితే… ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడి నెలకొంటున్న నేపథ్యంలో.. రంగంలోకి రాములమ్మ దిగారు. మరి ఆమెకు టికెట్‌ ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version