చిరంజీవి కాళ్లకు నమస్కరించిన మంత్రి పవన్ కల్యాణ్

-

ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించిన మంత్రి పవన్ కల్యాణ్..తన సంతోషాన్ని పంచుకున్నారు. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయతో ప్రమాణం చేయించారు.

పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి పవన్​ను ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version