చంద్రబాబుకి శిక్ష పడిందని మొక్కులు చెల్లించుకున్నా – మంత్రి రోజా

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబుకు శిక్ష పడిందనే తిరుమలకు వచ్చానని తెలిపారు. భగవంతుడు ఉన్నాడు.. తప్పు చేసిన చంద్రబాబుకు శిక్ష వేశాడు అన్నారు మంత్రి రోజా.

చంద్రబాబుకి శిక్ష పడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నానని పేర్కొన్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేస్ అని అన్నారు. నారా లోకేష్ గగ్గోలు పెడుతున్న తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు లోపలే ఉంటారని అన్నారు రోజా. అంతే కాదు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా లోపలికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సోమవారం రాత్రి మంత్రి రోజా కుటుంబ సభ్యులతో స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version