అంత కోరిక ఉంటే… బట్టలు మేమే విప్పి చూపిస్తాం… చూస్తావా – వైసీపీ ఎమ్మెల్యే

-

రెండు చోట్లా పవన్ కళ్యాణ్.. బట్టలు ఊడదీసి తరిమి కొట్టారని చురకలు అంటించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తొమ్మిది నెలలో ఎన్నికలు రాబోతున్నాయి ప్రతిపక్షాలన్నీ ఒకటై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాయని…. ప్రతి బహిరంగ సభలో వై.సి.పి. నాయకులను కార్యకర్తలను ఇష్టమొచ్చినట్టు తిట్టటం మొదలయిందని ఆగ్రహించారు.

చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్…అని… నాలుగు రోజుల నుండి పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కటం.. బట్టలు ఊడదీసి కొడతాను… తోలు తీస్తాను తాట తీస్తాను…. అని మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. రెండు చోట్లా పవన్ బట్టలు ఊడదీసి ప్రజలు తరిమి కొట్టారని… అసలు నీ గుర్తు ఏందో చెప్పు… నీ గాజు గ్లాస్ ఎగిరిపోయిందని పవన్‌ కు చురకలు అంటించారు.

చంద్రబాబు నాయుడు దగ్గర నీ తలకాయ తీసి పెట్టావు… కొన్ని కోట్లు చంద్రబాబు నాయుడు వద్ద తీసుకోవడం వాస్తవం అని ఆరోపించారు. నీకు అంత కోరికుంటే… మా బట్టలు విప్పదీసి మావి… చూడాలనుకుంటే చెప్పు వస్తామని… బ్రహ్మాండంగా మేమే వచ్చి గుడ్డలిప్పి చూపిస్తామని ఓ రేంజ్‌ రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version