ఆర్టీసీ బస్సు నడిపి డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

-

ఈ మధ్య కాలంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బైకులు, బస్సులు రకరకాల వాహనాలను నడిపి పార్టీ కార్యకర్తలను, అభిమానులను సంతోషపరుస్తున్నారు. దీనిని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ గా మారుతున్నాయి. తెలంగాణలో ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకసారి ఆర్టీసీ బస్సును నడిపాడు. మరోసారి నల్గొండలో మూడు చక్రాలు కలిగిన  బైకును నడుపుతూ గల్లీలలో తిరిగారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సును నడిపి డ్రైవర్ అవతారం ఎత్తారు.

హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. బస్సులకు పచ్చజెండా ఊపిన అనంతరం తాను కూడా స్టీరింగ్ పట్టి ఓ బస్సు నడిపారు బాలయ్య. కొద్దిదూరం బస్సు నడుపుతూ వెళ్లడంతో రోడ్డుపై ఉన్న జనం బాలకృష్ణను చూసేందుకు ఎగబడ్డారు. బాలకృష్ణను ఇలా కొత్త పాత్రలో చూడటం ఇటు అధికారుల్లో, అటు టీడీపీ కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది.  తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ బస్సు నడిపిన  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version