ఏపీలో కరోనా ఏమేరకు రచ్చ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవుతుండగా వంద మంది దాకా చనిపోతున్నారు. ఇక ఏపీలో రాజకీయ ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మరీ ఈ విషయం చెప్పారు.
“నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబుగారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీలో బోడె ప్రసాద్ కరోనా బారిన పడగా అయన కోలుకున్నారు. తాజగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ కూడా కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత @ncbn గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 28, 2020