సినిమాలు లేకుంటే అడుక్కోవడానికి కూడా పనికిరావు – వైసీపీ ఎంపీ

-

సినిమాలు లేకుంటే అడుక్కోవడానికి కూడా పనికిరావు అంటూ పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ విమర్శలు చేశారు. నువ్వు మగాడివైతే నాపై పోటీ చేయ్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ కు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ సవాల్‌ విసిరారు. నన్ను రాజీనామా చెయ్యమనడానికి నువ్వేవరు….దమ్ముంటే నాపై ఎంపీగా పోటీ చెయ్యి అంటూ ఛాలెంజ్‌ విసిరారు.

గాజువాకలో తుక్కు తుక్కుగా ఓడిపోయినోడివి నువ్వా నా గురించి మాట్లాడేది ఏందంటూ ఆగ్రహించారు.ఓడిపోయాక ఒక్క రోజు కూడా గాజువాక రానోడివి నువ్వా నన్ను ప్రశ్నించేది….ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను స్వాగతించి అప్పుడు పవన్ వైజాగ్ గురించి మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు. మాస్టర్ ప్లాన్స్, అనుమతులు, వ్యవస్థ మీద కనీస అవగాహన లేని పవన్ కళ్యాణ్..అలాంటి వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంను పాలిస్తానని చెబుతున్నాడని వెల్లడించారు. నీకంటే KA పాల్ 100 శాతం బెటర్…. నీకు సినిమాలు లేకపోతే అడుక్కు తినడానికి కూడా పనికి రావంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడలంటే నీకంటే చెత్త వ్యక్తి మరొకరు ఉండరని విమర్శలు చేశారు. బ్రో సినిమా డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోతే ఒక్క రూపాయి అయిన తిరిగి ఇచ్చావా అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version