నా మతం మానవత్వం.. డిక్లరేషన్ లో రాసుకోండి : మాజీ సీఎం జగన్

-

తిరుపతి లడ్డూ వివాదం గత కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమలకు ఇవాళ జగన్ రావాలనుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజాగా తాడేపల్లి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మతం గురించి స్పందించారు.  నా మతం మానవత్వం.. రాసుకుంటే డిక్లరేషన్ బుక్ లో రాసుకోండి.  నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను. హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తాను. ముస్లిం, జైన, సిక్కు మతాన్ని  అనుసరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే గుడిలోకి అనుమతిస్తలేరు. ఇక దళితుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.

మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అన్నారు. బీజేపీ కూడా హిందుత్వానికి మేమే రిప్రెజెంటేటివ్స్ మేమే అంటారు. అయ్యా బీజేపీ నాయకులారా..? మీ కళ్ల ఎదుటే.. మీ ఎన్డీఏ కూటమి భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వేంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్దాలు చెబుతున్నారు. కల్తీ నెయ్యితో లడ్డులు తయారు కాలేదని ఇన్ని ఆధారాలతో రుజువు అయ్యాక కూడా ఎందుకు చంద్రబాబును మందలించడం లేదు. చంద్రబాబును ఎందుకు వెనకేసుకొస్తున్నారు. మీ వాళ్లు ఏం చేసినా తప్పు కాదు.. మిగతా వాళ్లు చేస్తే.. తప్పా అని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. మానవత్వాన్ని చూపేదే హిందూ యిజం. మానవత్వాన్ని చూపని వారు మంచి హిందువు కారు అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version