వైసీపీకి నాగబాబు హెచ్చరికలు.. అలాంటి ఘటనలు చాలా ఉంటాయి !

-

వైసీపీకి జనసెన పార్టీ నేత నాగబాబు హెచ్చరికలు.. జారీ చేశారు. అలాంటి ఘటనలు చాలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలపై… జనసేన కార్యకర్తలు దాడి చేసే, ఛాన్స్ ఉందని ఈ మధ్య ఇంటలిజెన్స్ రిపోర్ట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటలిజెన్స్ రిపోర్ట్ పై జనసేన నేత నాగబాబు స్పందించారు.

 

జనసేన… వైసీపీ నాయకుల మీద దాడిచేయటం…ఇంటెలిజెన్సు హెచ్చరిక..సీక్రెట్ గా పంపిన సర్కులర్ మీడియా కి అందటం………ఓహో ఇప్పుడు జనసేన మీద మరో సారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధమని ట్వీట్ చేశారు. జనసైనుకులరా జాగ్రత్త …………వైజాగ్ ఇన్సిడెంట్స్ లాంటివి చాల ఉంటాయన్నారు నాగబాబు.

వైసీపీ ప్రభుత్వం కి ఒక సలహా .ఇలాంటి పనికిమాలిన పనులకి టైం వేస్ట్ చేయకండి .మీకు ఇంకా 1year 5మంత్స్ టైం వుంది.ప్రజలకి ,రాష్ట్ర అభివృద్ధి కి టైం వెచ్చించి కనీసం కొంత ఆయన మంచి గవర్నెన్స్ ని ap కి అందించండి.రేపు జరగబోయే ఎలక్షన్స్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని సూచించారు. మీరు మీ ప్రభుత్వ విధానాలు ఇలాగె ఉంటే మాత్రం గెలిచే అవకాశం కాదు కదా కనీసం గౌరంగా ఓడిపోయే అవకాశం కూడా కోల్పోతారనీ పేర్కొన్నారు నాగ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version