త్వరలోనే రోజా కూడా జైలుకే – నగరి ఎమ్మెల్యే

-

Nagari MLA Gali Bhanuprakash Warns RK Roja: వైసీపీ నేత రోజాపై టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేత రోజా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్. తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత… వైసిపి నేతలై టార్గెట్గా కేసులు పెడుతున్నారు. చాలామంది వైసిపి నేతలు కూడా అరెస్టు కావడం జరిగింది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ , జోగి రమేష్ కొడుకు రాజీవ్ కూడా అరెస్టు అయ్యారు.

Nagari MLA Gali Bhanuprakash Warns RK Roja

అతి త్వరలోనే జోగి రమేష్ కూడా అరెస్టు కాబోతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ మాజీమంత్రి రోజాకు టిడిపి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని చెప్పారు టిడిపి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ . ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆరోపించారు. వరదలపై ఇంట్లో కూర్చుని వీడియోలు చేయడం మానేసి బాధితులకు సాయం చేయాలని చురకలంటించారు టిడిపి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version