అమెరికాలో తెలుగు వైద్యుడి అనుమానాస్పద మృతి

-

అమెరికాలో మరో తెలుగు వాసి మరణించాడు. ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌బాబు (64) శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. తి ఆయన తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నా, ఘటన ఎలా జరిగిందో మాత్రం ఇంకా తెలియలేదు. డాక్టర్‌ రమేశ్‌బాబు అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు. టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు పెట్టారు. భారత్‌ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు రమేశ్ బాబు.

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఆయన మరణంతో ఇప్పుడు స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ నెల 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవలే మళ్లీ అమెరికాకు వెళ్లారు. అంతలోనే మృతి చెందారన్న వార్త కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version