షేక్ హసీనా దౌత్య పాస్‌పోర్టు రద్దు .. ఇక భారత్ లో ఉండటం కష్టమే!

-

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా దౌత్య పాస్‌పోర్టును ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆమె ఎక్కువకాలం ఆశ్రయం పొందడం కష్టతరం కానుంది. భారత వీసావిధానం ప్రకారం దౌత్య లేదా అధికారిక పాస్‌పోర్టులు కలిగిన బంగ్లాదేశ్‌ పౌరులు వీసా లేకుండా దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నా కేవలం 45 రోజుల పాటు మాత్రమే దేశంలో ఆశ్రయం పొందొచ్చు. షేక్‌ హసీనా భారత్‌కు వచ్చి ఇప్పటికే 20 రోజులు దాటిన విషయం తెలిసిందే. ఆమె భారత్లో అధికారికంగా ఉండటానికి గడువు దగ్గర పడుతోంది.

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంషేక్‌ హసీనా దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడంతో ఆమెను అక్కడి ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 2013లో కుదిరిన నేరస్థుల అప్పగింత ఒప్పందంలో 2016లో సవరణలు తీసుకొచ్చారు. కోర్టుల్లో నిందితుడిపై విచారణ ప్రారంభమైతే ఒప్పందం ప్రకారం అతడిని బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఆ కేసులు రాజకీయ ప్రేరేపితం అయితే తిరస్కరించేలా  ఒప్పందం జరిగింది. హత్య కేసులను రాజకీయ ప్రేరేపితమని గుర్తించడానికి వీల్లేదని మరో షరతు కూడా ఉంది. షేక్‌ హసీనాపై బంగ్లా ప్రభుత్వం మొత్తం 51 కేసులు నమోదు చేయగా.. వాటిలో 42 కేసుల హత్యకు సంబంధించినవే ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version