Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అదిరిపోయే ప్రకటన చేశారు. నవంబర్ నెలలో నంది అవార్డుల ప్రధానం చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏలూరు ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్ లో భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… నవంబర్ లో నంది అవార్డుల ప్రధానము ఉంటుందన్నారు.

కళ, సాంస్కృతిక రంగాలకు పునర్జీవనం తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. రాజమహేంద్రవరంలో నేషనల్ ఆఫ్ డ్రామాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో అమరావతిలో ఇండస్ట్రీ ఎదిగేందుకు కృషి చేస్తామని వివరించారు. ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ సిటీని నిర్మించి థీమ్ పార్కులు అలాగే గ్లోబల్ సినిమా ప్రొడక్షన్ జోన్లు కూడా అందుబాటులోకి తీసుకు వస్తామని కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. ఇక ఇదే కార్యక్రమంలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు.