పాడి రైతుల అభివృద్ధే మా లక్ష్యం: నారా బ్రాహ్మణి

-

పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం.. వారిని జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. ప్రణాళికలు అమలు చేస్తున్నామని హెరిటేజ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) నారా బ్రాహ్మణి తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం శంకరాపురం వద్ద ఉన్నహెరిటేజ్‌ డెయిరీలో పాడి రైతుల సమావేశాన్ని సోమవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెయిరీలో ఏర్పాటు చేసిన 25 వేల లీటర్ల పాలు, 20 వేల లీటర్ల పెరుగు ఉత్పత్తి సదుపాయం, ప్యాకింగ్‌ సౌకర్యాన్ని, బి.కొత్తపేటలోని బెంగళూరు రోడ్డు, సంతబజారు వీధిలో పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఆమె ప్రారంభించారు.

సమతుల పశువుల దాణా, దాణా సప్లిమెంట్లను సరసమైన ధరలకు అందించడంతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇన్సుమినేషన్ల సహాయంతో బ్రీడ్‌ను అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని బ్రాహ్మణి వివరించారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పాల ఉత్పత్తుల సంస్థల్లో హెరిటేజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పునరుద్ఘాటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,327.40 కోట్ల టర్నోవర్‌ను సాధించగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.29 లక్షల విలువైన మెగా చెక్కును ఈ సందర్భంగా బ్రాహ్మణి అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version