ఉంగుటూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ప్రచారం చేశారు…ఇది రాంగ్ అంటూ వెల్లడించారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేస్తున్నానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ బారినపడి చాలా కోళ్లు మరణించాయని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. బర్డ్ ఫ్లూపై భయాలు, అపోహలను సృష్టిస్తున్న పత్రికలపై చర్యల తీసుకుంటామని తెలిపారు. కేంద్రం ప్రభుత్వంతో పాటు శాస్త్రవేత్తలతో బర్డ్ ఫ్లూ వైరస్‌పై చర్చించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాన్ని స్పెషల్ జోన్ గా గుర్తించామని… బర్డ్ ఫ్లూ కు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు అన్నారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.