ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌..1వ తేదీ దాటినా అందని జీతాలు !

-

 

ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌..1 వ తేదీ దాటినా జీతాలు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 80% మందికి ఫిబ్రవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. మార్చి 6 తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాలేదు.


వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థితి కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా, మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చేది అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అటు ఏపీ ఉద్యోగుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుంచి ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభం కానుందని తెలిపారు ఏపీ జె.ఏ.సి. అమరావతి చైర్మన్ బొప్పారాజు వేంకటేశ్వర్లు. అలాగే, సంఘాలలో ఐక్యత లేకపోయినా ఉద్యోగులు అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలి…దశల వారీగా నిరసనలు,ప్రదర్శనలు చేయాలని కోరారు ఏపీ జె.ఏ.సి. అమరావతి చైర్మన్ బొప్పారాజు వేంకటేశ్వర్లు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version