BREAKING: వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు

-

వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు రంగంలోకి దిగనున్నారు. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నారైల ప్రచారం ఉంటుంది. 4 బస్సుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నారై బృందాల పర్యటన ఉండనుంది. ఈ మేరకు నేడు బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సజ్జల.

NRI in election campaign on behalf of YCP

కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి వెళ్లడం లేదు సీఎం జగన్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని చేసేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవాళ ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో… గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version